చిత్తూరు జిల్లా అభివృద్ధిపై ఎంపీ మిథున్‌రెడ్డి సవాల్‌ను లోకేశ్ ఎప్పుడో స్వీకరించారని, చర్చకు సిద్ధమని ఎప్పుడో అంగీకరించారని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చెప్పారు. మొన్నటి వరకు చర్చకు రాని మిథున్‌రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా లోకేశ్ రారని తెలిసి.. ఇప్పుడు చర్చకు పిలవడంలో అర్ధమేంటని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్నంత వరకు చర్చకు రాకుండా ఇంట్లో దాక్కొని, ఇప్పుడు రమ్మనడం వైసీపీ నేతల పిరికితనానికి, అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు.