వివేకా హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. రేపు జరిగే సీబీఐ విచారణకు తాను హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు. పార్లమెంట్ రెండో సమావేశాల దృష్ట్యా మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఈరోజు తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. అవినాష్ రెడ్డిపై తీర్పు వెలువడే వరకు కఠిన చర్యలుకు దిగొద్దంటూ సీబీఐని ఆదేశించింది. హత్యకేసులో వివేకా రెండో భార్య షమీ, అల్లుడు రాజశేఖర్ పాత్రపై సీబీఐ దర్యాప్తు చేయలేదన్నారు. ఇందులో ఆస్తి, కుటుంబ తగాదాలు కూడా ఉన్నాయని, అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించాలని కోరారు.