స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలతో ముగిశాయి. వరుసగా మూడో రోజు నష్టాల్లోనే ముగిసింది.దీంతో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 897 పాయింట్లు నష్టపోయి 58,237 వద్ద ముగిసింది. నిఫ్టీ 258 పాయింట్లు నష్టపోయి 17,154 వద్ద కొనసాగుతోంది.బీఎస్ఈ సెన్సెక్స్ లో కేవలం టెక్ మహీంద్రా (6.83%) మాత్రం లాభపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ (-7.46%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.21%), టాటా మోటార్స్ (-3.06%), మహీంద్రా అండ్ మహీంద్రా (-2.57%), బజాజ్ ఫిన్ సర్వ్ (-2.47%) టాప్ లూజర్లుగా ఉన్నాయి.