చిన్న వయస్సులో పెద్ద మనస్సును చాట్టాడో బాలుడు. జీవితంలో ఎదగడానికి గొప్పవాళ్లను జీవిత చరిత్రలను కొందరు ప్రేరణగా తీసుకుంటే.. మరికొందరు సినిమాలు, పుస్తకాల ద్వారా ప్రేరణ పొందుతారు. తాజాగా, ఓ పదేళ్లు బాలుడు ఉన్నతస్థాయికి ఎదగాలంటే వయసుతో సంబంధం లేదని నిరూపించాడు. మూడేళ్లలో ఏడు కోట్లు సంపాదించి.. నేటి తరానికి ఆదర్శంగా నిలిచాడు. అతడే బ్రిటన్‌కు చెందిన పదేళ్ల చిన్నారి మాక్స్ వూసే మాక్స్ ఇంటికి సమీపంలోనే రిక్ అబాట్ అనే ఓ పెద్దాయన ఉండేవారు. మ్యాక్స్ కుటుంబానికి సన్నిహితుడైన ఆయన.. 74 ఏళ్ల వయసులో కేన్సర్ తో మృతిచెందాడు.
మాక్స్‌తో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడటంతో.. చనిపోవడానికి తన దగ్గర ఉన్న టెంట్‌ను బహుమతిగా అందజేసి.. దీంతో ఏదైనా సాహసకార్యం చేయమని సలహా ఇచ్చారు. రిక్ మాటలు మ్యాక్స్ మనసులో బలంగా నాటుకుపోయాయి. దీంతో తాను ఇంట్లో కాకుండా మూడేళ్ల పాటు ఆరుబయట టెంట్‌లో నిద్రించాలని నిర్ణయం తీసుకున్నాడు. ఓ స్వచ్ఛంద సంస్థకు నిధులు సమకూర్చడం కోసం పదేళ్ల వయసులో 2020 మార్చి 29 నుంచి తన ఇంటి బయట ఉన్న తోటలో నిద్రించడం ప్రారంభించాడు.
అలా టెంట్‌లో నిద్రపోతూ విరాళాలు సేకరించడం ప్రారంభించి మ్యాక్స్.. ఇలా వచ్చిన మొత్తాన్ని నార్త్ దేవాన్ హోస్పిస్ అనే స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి మ్యాక్స్‌ను ప్రోత్సహిస్తూ పలువురు మాక్స్‌కు విరాళాలు పంపించారు. ఇలా సేకరించగా మొత్తం ఇప్పుడు దాదాపు రూ.7 కోట్లకు చేరింది. బాలుడి ఆశయం గురించి తెలిసి ఆశ్చర్యపోయిన అప్పటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మ్యాక్స్‌ను తన కార్యాలయానికి పిలిపించి ముచ్చటించారు. బ్రిటిష్ ప్రభుత్వ 2022 మేలో బ్రిటిష్ ఎంపైర్ మెడల్ ఇచ్చి సత్కరించింది.
టెంట్‌లో ఆరు బయట నిద్ర ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఏప్రిల్ 1న బ్రూమ్‌హిల్ ఎస్టేట్‌లో వేడుకలను నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఫైట్ క్లబ్ నుంచి బార్ ఆఫ్ సోప్ సహా లెజెండరీ మూవీ మెమోరాబిలియ, పార్టీ బస్సు ప్రదర్శనలో ఉంచుతారు. బ్రూమ్‌హిల్ ఎస్టేట్ ప్రతినిధి మాట్లాడుతూ.. మాక్స్ సాధించిన విజయాన్ని జరుపుకోవడానికి ఇది ఒక చారిత్ర దినం అని అన్నారు.
మాక్స్ ఆఖరి నిధుల సమీకరణ మూడు సంగీత వేదికలతో పాటు మునుపెన్నడూ చూడని ప్రామాణికమైన చలనచిత్ర జ్ఞాపిక ప్రదర్శన. బ్రాడ్ పిట్ కత్తి, ట్రాయ్ సినిమా షీల్డ్, జుమాంజి చిత్రం నుంచి ఒరిజినల్ బోర్డ్‌ను కలిగి ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, స్టార్ వార్స్ ఫేమ్ వెల్ష్ నటుడు, స్టంట్ మ్యాన్ ఇయాన్ వైట్ అతిథి పాత్ర కూడా ఉంటుందని చెప్పారు.