పరస్పర అంగీకారంతో సెక్స్ అత్యాచారం కాదని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ.. తన మాజీ ప్రియుడిపై పెట్టిన అత్యాచారం కేసును కర్ణాటక హైకోర్టు రద్దుచేసింది. ఇరువురూ పరస్పర అంగీకారంతో ఐదేళ్ల పాటు శారీరక సంబంధం కొనసాగించారని, దీనిని అత్యాచారంగా పరిగణించలేమని హైకోర్టు తప్పుబట్టింది. నిందితుడిపై కేసును రద్దుచేసిన జస్టిస్ ఎం నాగప్రసన్న.. ఈ కేసులో ఒకసారి, రెండుసార్లు లేదా మూడుసార్లు లేదా రోజులు లేదా నెలలు కాదు చాలా సంవత్సరాలు.. ఐదేళ్లు సమ్మతితో ఇద్దరి మధ్య శారీరక సంబంధం కొనసాగిందని వ్యాఖ్యానించింది.
‘‘ఒక మహిళ సమ్మతి ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఐదేళ్ల పాటు కొనసాగిందని చెప్పలేం... ఇది సెక్షన్ 376 ప్రకారం నేరంగా మారడం కోసం ఇద్దరి మధ్య సంబంధం వ్యవధి ఐపీసీ సెక్షన్ 375లో తీవ్రతను తగ్గిస్తుంది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సెక్షన్ 375 సమ్మతి లేకుండ.. మహిళ సమ్మతికి వ్యతిరేకంగా లైంగిక సంపర్కాన్ని అత్యాచారంగా పరిగణిస్తుంది.. అయితే సెక్షన్ 376 అత్యాచారానికి శిక్షను అందిస్తుంది. బెంగళూరుకు చెందిన వ్యక్తి 53వ సిటీ సివిల్, సెషన్స్ కోర్టులో తనపై చేపట్టిన చర్యలను హైకోర్టులో సవాల్ చేశాడు.
‘ఫిర్యాదుదారుడు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.. వివాహం చేసుకోవాలనుకున్నారు.. అయితే కులాలు వేరు కావడంతో కుదరలేదు. ఐపీసీ సెక్షన్ 406 ప్రకారం నిందితులు, ఫిర్యాదుదారు మధ్య ఆర్థిక లావాదేవీలు నేరపూరిత ఉల్లంఘనకు సంబంధించిన అంశంగా మారదని న్యాయమూర్తి అన్నారు. అయితే సెక్షన్ 323 (భయంకరమైన దాడి), సెక్షన్ 506 (నేరపూరిత బెదిరింపు) కింద అతడు విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది.
పెళ్లి పేరుతో పలు సందర్భాల్లో తనతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడని.. అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ సదరు వ్యక్తిపై ఆ మహిళ క్రిమినల్ కేసులు పెట్టింది. ‘ఇది పరస్పర అంగీకారంతో కూడుకున్నది కాబట్టి ఇది ఏవిధంగా చూసినా అత్యాచారం కాదు’ అని ఆ వ్యక్తి వాదించాడు. తప్పుడు వాగ్దానం లేదా పెళ్లి సాకుతో లైంగిక వాంఛలు తీసుకుంటే అది అత్యాచారం అవుతుంది అని ఫిర్యాదుదారు తరఫున లాయర్ వాదనలు వినిపించారు. కాగా, గతేడాది జులైలోనూ కేరళ హైకోర్టు కూడా ఓ కేసులో ఇటువంటి తీర్పునే ఇచ్చింది. ఇద్దరు మేజర్లు పరస్పరం పూర్తి అంగీకారంతో చేసే సెక్స్‌ను రేప్‌గా పరిగణించలేమని కేరళ హైకోర్టు వెల్లడించింది. అయితే, ఆ ఆమోదం ద్రోహపూరితంగా కానీ, మోసపూరితంగా కానీ పొందకూడదని స్పష్టం చేసింది.