ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రబీ కాలానికి సంబంధించిన పప్పు ధాన్యాల కొనుగోలుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా రైతులు తాము పండించిన పంటలు అమ్ముకునే వేళ దళారుల చేతిలో మోసపోతున్నారు. ఇలాంటి మోసాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 99,278 టన్నుల మినుములు, 1,11,933 టన్నుల శనగలతో పాటు వేరుశనగ, పెసలు వంటి వాటిని ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేయనుంది.