వంట గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్న వేల పుదుచ్చేరి ప్రభుత్వం ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రేషన్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏకంగా రూ.300 సబ్సిడీ ఇవ్వనున్నట్టు రంగస్వామి ప్రభుత్వం ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ పథకానికి బడ్జెట్లో రూ. 126 కోట్లు కేటాయించామని ముఖ్యమంత్రి రంగస్వామి వెల్లడించారు.