ఆఫ్రికాలోని మలావి దేశంలో ఫ్రెడ్డీ తుపాను అల్లకల్లోలం సృష్టించింది. తుపాను ధాటికి వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మలావిలో నెల వ్యవధిలో ఫ్రెడ్డీ తుపాను ఆఫ్రికాను అతలాకుతలం చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. భారీ తుపాను ధాటికి ఎటు చూసినా నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆ నీటి ప్రవాహంలోనే ప్రజలు కొట్టుకుపోతున్నారు. ఎక్కడికక్కడ భవనాలు కూలిపోతున్నాయి. ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఎక్కడికక్కడ కూరుకుపోయి ఉన్నారు.