ఈ నెల 24వ తేదీ వరకు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఇదిలావుంటే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం . ఈ నాలుగేళ్లలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. అనంతరం ఉభయ సభలు వాయిదాపడగా.. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ నెల 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీలో నిర్ణయం తీసుకున్నారు.. అంటే తొమ్మిది రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు.
అలాగే ఈ నెల 19, 22వ తేదీల్లో అసెంబ్లీకి సెలవు ఉంటుంది. బీఏసీ సమావేశానికి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇటు టీడీపీ నుంచి అచ్చెన్నాయుడుతో పాటూ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అంతకముందు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంలో వృద్ధి రేటుపై టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డారు.. దీంతో కొద్దిసేపు గందరగోళం కనిపించింది. గవర్నర్‌తో కల్పిత లెక్కలను ప్రభుత్వం చెప్పిస్తోందని టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్‌తో అన్నీ అసత్యాలే పలికిస్తున్నారని సభ నుంచి టీడీపీ నేతలు వాకౌట్ చేశారు.
ప్రాజెక్ట్‌ల అంశానికి వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్ట్‌లో పురోగతి.. 54 ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లో 14 పూర్తి చేశామని గవర్నర్ చెప్పడంపై సభలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. అసత్యాలు భరించలేకపోతున్నామని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ చేత అసత్యాలు చెప్పిస్తున్నారంటూ టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లారు.