విజయవాడ నగరం నందు జల వనరుల శాఖ ఇంజినీర్- ఇన్- చీఫ్ సి. నారాయణ రెడ్డిని ఆయన కార్యాలయం నందు మంగళవారం ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు కలిసి సోమశిల బ్యాక్ వాటర్ , వై. కోట ప్రొటెక్షన్ వాల్, రైల్వే కోడూరు మండల లెప్రసీ కాలనీ ప్రొటెక్షన్ వాల్ లకు త్వరగా ఆర్థిక ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాలని కోరారు. త్వరితగతిన ప్రభుత్వానికి సమర్పించిన యెడల ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మంజూరు కొరకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సుముఖంగా ఉన్నారని ఇంజనీర్ -ఇన్-చీప్ కు ప్రభుత్వం తెలియజేశారు.