విశాఖపట్టణం పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం దృష్ట్యా ఈ నెల 20వ తేదీన విశాఖపట్టణంలో ప్రాంతీయ స్థాయి డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు విజయనగరం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎ. ఈశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎం. వి. పి. బస్ కాంప్లెక్స్ పక్కనున్న పోస్ట్ మాస్టర్ జనరల్ కార్యాలయంలో 20వ తేదీ ఉదయం 11. 00 గంటలకు 109వ అదాలత్ జరుగుతుందని, తపాలా వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదులను ఈ నెల 16వ తేదీ లోగా '109వ తపాలా అదాలత్, డబ్ల్యు. నాగాధిత్య కుమార్, అసిస్టెంట్ డైరెక్టర్, పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయం, విశాఖపట్టణం- 530017'అనే చిరునామాకు పంపించాలని సూచించారు.