ఓ మహిళ తాను చిన్నప్పట్నుండి ఆరాధించిన దైవాన్నే పెళ్లిచేసుకున్న విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఔరేయా జిల్లాలోని బిధునా పట్టణానికి చెందిన రక్షా సోలంకికి చిన్నప్పట్నుండి శ్రీకృష్ణుడంటే అమితమైన భక్తి, ప్రేమ. దీంతో ఆమె కృష్ణుణ్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం తల్లిదండ్రులను ఒప్పించి కృష్ణుడి విగ్రహాన్ని పెళ్లి చేసుకుంది. వివాహ అనంతరం బంధువులు వధువుకు అప్పగింతల కార్యక్రమం సైతం నిర్వహించారు.