వ్యవసాయ అధికారులు రైతులకు నిరంతరం అందుబాటులో ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి అబ్దుల్ సత్తార్ అన్నారు. రేపల్లె వ్యవసాయ శాఖ కార్యాలయంలో మంగళవారం వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో నేటి వరకు ఈకేవైసీ చేయించుకోని రైతులను గుర్తించి త్వరితగతిన నూరుశాతం రైతులు ఈకేవైసీ చేయించుకునే విధంగా అవగాహన కల్పించాలన్నారు. డాక్టర్ వైఎస్సార్ యంత్ర సేవా పరికరాలలో భాగంగా ఐదుగురు సభ్యులను గ్రూపులుగా ఏర్పాటు చేసి వారికి కావాల్సిన ట్రాక్టర్లు, రోటావేటర్లు, అయిల్ ఇంజన్లు, తైవాన్ స్పేయర్లు ఇప్పించాల్సిందిగా సూచించారు.