బాపట్ల జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్ లు తాబెళ్లను మంగళవారము సముద్రంలోకి వదిలారు. సముద్రంలో జీవ వైవిధ్యం పెరిగేలా వీటిని వదిలినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ తాబేళ్ల అభివృద్ధికి జిల్లాలో 7 ప్రాంతాలు ఎంపిక చేశామన్నారు. ఈ ప్రాంతాల్లో తాబేళ్లు గుడ్లు పొద గడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు కల్పించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమం లో ఏ ఎస్ పి మహేష్, సూర్యలంక ఎయిర్ ఫోర్స్ కమాండర్ చౌదరి, తహశీల్దార్ కవిత, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.