పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణ ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి అధికారుల సమన్వయ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలు మార్చే పదో తరగతి పరీక్షలు అన్ని ఏర్పాటులు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు చక్కగా పరీక్షలు రాయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. బాపట్ల జిల్లాలో 331 పాఠశాలల నుంచి 17344 మంది విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్నారు అన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ కే శ్రీనివాసులు, ఏఎస్పీ మహేష్, డిఇఓ పివి రామారావు, వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ విజయమ్మ, డిపిఓ వై శంకర్ నాయక్, ఆర్టీవో చంద్రశేఖర్ రెడ్డి, ఆర్టీసీ ఆర్ఎం రామారావు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.