ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల బందోబస్తు ఆగిరిపల్లి పోలీసులు నిర్వహించారు. ఆగిరిపల్లి ఎస్సై నంబూరి చంటిబాబు, వారి సిబ్బంది ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల సందర్భంగా బుధవారం స్థానిక ఎం. వి. ఎన్. వైవిఎన్ జూనియర్ కళాశాల నందు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హాల్ టికెట్ మరచిపోయి ఆందోళన చెందుతున్న కనసానపల్లికి చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థినికి ధైర్యం చెప్పి అక్కడ బందోబస్తు విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీస్ మాధవి తో ఆన్లైన్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేయించి కానిస్టేబుల్ అశోక్ సహాయంతో స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి హాల్ టికెట్ కాపీ తెప్పించి నిర్ణీత సమయానికి ఆమె పరీక్షకు హాజరయ్యేట్లుగా కృషి చేసి ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్సై విద్యార్థులను ఉద్దేశించి పలు సూచనలు చేశారు. పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయం కంటే అరగంట ముందుగా రావాలని, విద్యార్థులు , ఇన్విజిలేటర్స్ ఇతర సహాయక సిబ్బంది ఎటువంటి మొబైల్ ఫోన్లు గాని, స్మార్ట్ వాచెస్ గాని, స్మార్ట్ ఫోన్ గాని, మరి ఏ ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడబోవని, విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే ముందే వారి యొక్క హాల్ టికెట్లు తదితర పరీక్షకు సామాగ్రి వెంట తెచ్చుకోవాలని కోరారు