వెలగపూడి లోని మారుతి సుజికీ షోరూమ్ నుండి అసెంబ్లీ సమావేశాలకు పాదయాత్రగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్లారు. తన నియోజకవర్గం లోని ప్రజా సమస్యల పరిష్కారానికి నా నిరసన కొనసాగుతోందని, సమస్యల పరిష్కారం కోసం నాలుగేళ్లు పోరాటం చేసి గళం వినిపిస్తున్నానన్నారు. మైక్ ఇవ్వకపోతే అసెంబ్లీ జరిగినన్ని రోజులు ప్లకార్డ్ ప్రదర్శిస్తూ నిలబడే ఉంటానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.