వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురై నేటికి నాలుగేళ్లు పూర్తయ్యాయని, ఆయనకు ఇప్పటికైనా న్యాయం చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ‘జస్టిస్ ఫర్ వివేకా‘ అంటూ బుధవారం ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్లలో జగన్ ఒక్క పనీ చేయలేకపోయాడని విమర్శించారు. చివరకు సొంత బాబాయి హత్యకు గురైతే హంతకులను చట్టపరంగా శిక్షించడంలోనూ విఫలమయ్యాడని మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa