గ్రామ ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి సేవలు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు భీమవరపు పద్మావతి సంజీవరెడ్డి అన్నారు. బుధవారం కొల్లిపర మండల పరిధిలోని మున్నంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజా వైద్యశాల అభివృద్ధి సలహా సంఘం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీపీ భీమవరపుపద్మావతి సంజీవరెడ్డి హాజరయ్యారు. అనంతరం ప్రజా వైద్యశాలలో డాక్టర్ చిక్కాల లక్ష్మీసుధ ఆధ్వర్యంలో ఔషధాలు, పరికరాలు, రక్త నమూనా యంత్రాలు పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ ప్రజలకుప్రభుత్వ ఆసుపత్రిలోఅన్నిరకాల మందులు, రక్తపరీక్షలు ఉచితంగా చేయడం జరుగుతుందన్నారు.