ఆంధ్ర రాష్ట్ర సాధనకు ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతి వేడుకలు గురువారం ఉరవకొండలో ఘనంగా జరిగాయి. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద సర్పంచ్ మీనుగా లలిత, ఎంపీపీ చందా చంద్రమ్మ, పార్టీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు బసవరాజు, వార్డు సభ్యుడు నిరంజన్ గౌడ్, కో అప్షన్ సభ్యులు పామిడి సలీమ్, ఈఓ గౌస్ తదితరులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని, ఆయన త్యాగాన్ని ఎవరు మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఓబన్న, నిర్మలమ్మ, మైనారిటీ నాయకులు పామిడి జాకీర్, మద్దికెర అన్వర్, తాజుద్దీన్, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.