విమాన పైలెట్లు అంటే ఎంతో క్రమశిక్షణగా మెలగాలి. కానీ ఓ విమాన పైలెట్లు తమ తీరుతో ఉద్యోగానికి ఎసరు తెచ్చుకున్నారు. విమానం కాక్పిట్లో స్వీట్లు తిన్న ఇద్దరు పైలట్లను సైస్జెట్ యాజమాన్యం విధులకు దూరం చేసింది. హోలీ సందర్భంగా ఆ ఇద్దరు పైలట్లు నిబంధనలను ఉల్లంఘిస్తూ కాక్పిట్లో కూల్డ్రింక్ గ్లాసులు తీసుకెళ్లారని, స్వీట్లు తిన్నారని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ నుంచి గువహటీకి వెళ్లే విమానంలో ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో పైలట్లపై సీరియస్ అయిన యాజమాన్యం వారిని రోస్టర్ నుంచి తొలగిస్తూ విధులకు దూరం చేసింది. పైలట్లపై దర్యాప్తు ప్రారంభించింది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ ప్రతినిధి స్పందించారు. దర్యాప్తు పూర్తయ్యాక బాధ్యులపై తగు చర్యలు తీసుకుంటామన్నారు.