ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ మరో కేసు నమోదు చేసింది. సీబీఐ జైల్లో ఉన్న సిసోడియాపై ఢిల్లీ ఫీడ్ బ్యాక్ యూనిట్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. మనీష్ సిసోడియాతో పాటు మరో ఏడుగురిని నిందితులుగా చేర్చింది సీబీఐ. నేరపూరిత కుట్ర, ఆస్తుల దుర్వినియోగం, ఫోర్జరీ, నకిలీ డాక్యుమెంట్లు ఉపయోగించారని అభియోగాలు నమోదు చేసింది.