పచ్చి పాలు పాశ్చరైజ్ చేయనందున అందులో హానికర బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది. అందువల్ల పచ్చి పాలు తీసుకుంటే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, ఫ్లూ, అతిసారం, ఒంటినొప్పులు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఆస్తమా, తామర, అలెర్జీల ప్రమాదాన్ని పచ్చిపాలు తగ్గిస్తాయని అయితే వైద్యుల సూచన మేరకు తీసుకోవాలని పేర్కొంటున్నారు.