ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐ.ఎం.డి)అంచనా వేసింది. ముందుగా ఈ నెల 16వ తేదీ నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ విభాగం తెలిపిన సమాచారం మేరకు 17 వతేదీ తెల్లవారు జాము నుంచే వర్షాలు ప్రారంభయ్యాయి. డెల్టా ప్రాంతంలో మినుము, పెసర పంటలు కొన్ని చోట్ల పీకుడు దశలో ఉన్నాయి. మరికొన్ని చోట్ల ఓదెల దశలో ఉన్నాయి. పీకి ఓదే మీద ఉన్న పంట ఓదేలు తిప్పు కోవచ్చు అని, పీకుడు దశలో ఉన్న పంట కాయ రాలిపోతుందేమోననే బయాందొళనలో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం వర్షం నాలుగు రోజులు కురిస్తే అధిక ముప్పు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు. యంత్రాల ద్వారా మినుము, పెసర పంటలు నూర్పిడి చేసిన రైతులు చేతికొచ్చిన పంట నీటిపాలవకుండా పరదాలు కప్పి దక్కించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.