ఉద్యోగం నుంచి తీసేశారన్న కోపంతో ఓ వ్యక్తి యాసిడ్ పోసిన ఘటన యూపీలోని నొయిడాలో జరిగింది. రామ్రాజ్ అనే యువకుడు మాక్స్బ్లిస్ వైట్ హౌస్ సొసైటీకి చెందిన ఓ భవనంలో కారు క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇటీవల అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆగ్రహించిన యువకుడు పార్కింగ్ సెల్లార్లో ఉన్న సుమారు 12 ఖరీదైన కార్లపై యాసిడ్ పోసి ధ్వంసం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు.