ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం జగన్ శుక్రవారం భేటీ అయ్యారు. సుమారు 45 నిమిషాలపాటు వారి మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించినట్లు సమాచారం. దీంతో ప్రధాని మోడీ, సీఎం జగన్ భేటీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. వారు ఏ అంశాలపై చర్చించారనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను సీఎం జగన్ కలవనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa