అల్లూరి జిల్లా పాడేరు మండలంలోని సలుగు పంచాయతీ పరిధి పెదనందిపుట్టు గ్రామానికి చెందిన యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని సలుగు పంచాయతీ పరిధి పెదనందిపుట్టు గ్రామానికి చెందిన వంతల. నాగేశ్వరరావు (28)కు జనవరి 17 నుంచి కుటుంబీకులు ఎంత వెతికిన నాగేశ్వరావు ఆచూకీ లభించలేదు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం సలుగు పంచాయితీ గిరిజనులు అడవికి వేటకు వెళ్ళగా బుర్దపాడు కొండపై కూల్లిపోయి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. దీనితో పంచాయతీ గిరిజనులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన చోటుకి పోలీసులు చేరుకోగా కుటుంబికులు మృతుని శరీర అవయవాలు దుస్తులను బట్టి గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.