ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత్ 13వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ వెల్లడించింది. ఆప్ఘనిస్థాన్ ఈ సూచీలో అగ్రస్థానంలో ఉంది. పరారీలో ఉన్న దావూద్ ఇబ్రహీంకు చెందిన ‘డి’ కంపెనీ ముంబయిలో నకిలీ సాంస్కృతిక ఉత్పత్తుల బ్లాక్ మార్కెట్ లో అధిక భాగాన్ని నియంత్రిస్తోందని నివేదిక తెలిపింది. ఆయుధాలు, విలువైన లోహాల అక్రమ రవాణా, వ్యభిచారం, దోపిడీల ద్వారా లాభం పొందిన క్రిమినల్ సంస్థగా అభివర్ణించింది.