ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఎటా జిల్లాలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరిగింది. రాంపూర్ పోలీస్ స్టేషన్ లోని నాగ్లా కోఠి గ్రామంలో ఇరువర్గాల వారు పరస్పరం కాల్పులు జరుపుకున్నారు. ఒక వర్గం వైపు నుండి కాల్పులు చేస్తున్న వీడియో బయటపడింది. ఈ గొడవలో 5 మందికి గాయాలయ్యాయి. ఒక గ్రూపులో ముగ్గురికి, మరో గ్రూపులో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.