తాను పీఎం కార్యాలయం (PMO)లో అదనపు డైరెక్టర్‌నని చెప్పి ఓ వ్యక్తి ఏకంగా జమ్మూ కశ్మీర్ అధికారులనే బురిడి కొట్టించాడు. గుజరాత్‌కు చెందిన కిరణ్ తాను పీఎంఓ అధికారిని అంటూ కశ్మీర్లో ప్రభుత్వ ఆతిథ్యాన్ని స్వీకరిస్తూ అక్కడి అధికారులతో సమీక్షించేవాడు. పోలీసులు కిరణ్‌కు ఓ వ్యక్తిగత భద్రతా అధికారితో పాటు గ్రాండ్ హోటల్లో గది కూడా ఏర్పాటు చేశారు. ఇటీవల కశ్మీర్ CID అధికారులు అతను ఫేక్ అని గుర్తించి అరెస్ట్ చేశారు.