కొందరు ఎంత కష్టపడినా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాంటి వారు వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవాలి. ఏమైనా దోషాలుంటే వాటికి పరిహారం చేయాలి. ఇంటికి ఉత్తర భాగానికి నీలం రంగు వేస్తే మంచిదని, వంటగది ఆగ్నేయంలో ఉండాలని పేర్కొంటున్నారు. ప్రవేశ ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఈ చిట్కాలు పాటిస్తే ఆర్థిక సమస్యలు తొలగుతాయని పండితులు సూచిస్తున్నారు.