చైనాలో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ గురించి కొత్త అధ్యయనాలు వెలుగులోకి వచ్చాయి. వూహాన్ చేపల మార్కెట్‌లో విక్రయించిన రాకూన్ జాతి కుక్కల జన్యుపదార్థంలో కొవిడ్ కారక సార్స్‌కోవ్-2 వైరస్ ఆనవాళ్లు కనిపించాయని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. దీన్నిబట్టి కొవిడ్ కారక కరోనా వైరస్ ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించినది కాదనీ, అది ప్రకృతిలో సహజంగానే ఉత్పన్నమై ఉండవచ్చని వారు భావిస్తున్నారు.