బీహార్ లోని బెగుసరాయ్ జిల్లాలో ఓ ఘటన ఆశ్చర్యానికి గురి చేసింది. కరోనా కాలంలో కంటైన్ మెంట్ జోన్లలో పెట్టిన బారికేడ్లను తొలగించడంతో రెండేళ్ల బాలుడిపై కేసు నమోదు చేశారు. రెండేళ్ల తరువాత ఆ బాలుడు తనకు బెయిల్ కావాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఆ పిల్లాడిపై నమోదు చేసిన కేసును పరిశీలించిన న్యాయమూర్తి.. ఈ కేసుకు సంబంధించి అరెస్టు, బెయిల్ కు ఎలాంటి నిబంధనలు లేవని తేల్చారు. అటు బాలుడిపై కేసు నమోదు చేయడంతో పోలీసులను మందలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa