శ్రీరామనవమి సందర్భంగా ఆర్మూర్ డివిజన్లోని అన్ని పోస్టాఫీసులలో భద్రాచలం శ్రీ సీతారామ దేవస్థానంలో జరిగే శ్రీ సీతా రాముల కళ్యాణానికి సంబంధించిన తలంబ్రాలను ఆర్మూర్ డివిజన్లోని అన్ని బ్రాంచ్ పోస్టాఫీస్ లలో ఇంటి వద్దకే స్పీడ్ పోస్ట్ ద్వారా అందించడానికి తపాలా శాఖ సన్నాహాలు చేసిందని శుక్రవారం సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ తెలియజేశారు. అంత్రాలయ అర్చన కళ్యాణ తలంబ్రాలు 450/- రూపాయలకు, ముత్యాల తలంబ్రాలు 150/- రూపాయలకు స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటి వద్దకి వచ్చే అవకాశాన్ని పోస్టల్ శాఖ రూపొందించిందని ఈ సదావకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తపాల శాఖ సహాయ పర్యవేక్షకురాలు యాపరు సురేఖ ఒక ప్రకటనలో కోరారు.