బీహార్ లోని నవాడా జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లి చేసుకోమని అడిగినందుకు గర్భవతైన మైనర్ బాలికను ప్రియుడు, అతడి కుటుంబ సభ్యులు సజీవదహనం చేశారు. గత కొంతకాలంగా బాలిక, యువకుడు ప్రేమలో ఉన్నారు. ఇటీవల బాలిక గర్భం దాల్చడంతో యువకుడ్ని పెళ్లి చేసుకోమని అడిగింది. దీంతో యువకుడు, అతని కుటుంబసభ్యులు ఆమెకు నిప్పంటించారు. ఈ ఘటన ఈనెల 13న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.