రైతులు వేసిన పంటలే మళ్లీ వేయడం వల్ల బారీగా నష్టపోతున్నారు. అయితే పంట మార్పిడి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాఖాధికారులు చెబుతున్నారు. పంట మార్పిడి వల్ల నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి చెందుతుంది. చీడపీడలు దూరం అవుతాయి. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గుతుంది. పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంది.