అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం ఓబులవారిపల్లి మండలం వై. కోట గ్రామంలో వారు మాట్లాడుతూ అకాల వర్షానికి తోడుగా గాలి, వడగళ్ళు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. విపరీతమైన గాలులకు అరటి తోటలు కుప్పకూలిపోయాయని, వడగళ్ళు పడడంతో కర్బూజా, దోసకాయలు పగిలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే అంచనాలు తయారు చేసి ఉన్నత అధికారులకు పంపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు చంగయ్య, హరి, జయరామయ్య, పెంచలయ్య, రమణ పాల్గొన్నారు.