ఏపీలో ప్రతి ఒక్కరూ ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు ప్రత్యేక క్యాంప్‌ను నిర్వహిస్తుంది. ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ నెల 20, 27, 28, 29 తేదీల్లో ప్రత్యేక క్యాంపులు నిప్వహించనున్నారు. నూతన జిల్లాల వారీగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.