దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇన్‌ఫ్లుయెంజా ప్లూ రోగం బెడద పెరుగుతోంది. ఎంతోమంది దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒంటినొప్పులు తదితర లక్షణాలతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ప్రజలకు కొన్ని సలహాలు విడుదల చేశారు. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్‌లో ఎక్కువ కేసులు నమోదు కాగా ఐసీఎంఆర్ ల్యాబ్ డేటా విశ్లేషణలో కర్ణాటకలో కూడా ఇన్‌ఫ్లుయెంజా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఈ జబ్బుకు ఒసెల్టామివిర్ మాత్రలను చికిత్సా విధానంలో చేర్చారు. ఇవి అన్ని ఆరోగ్యకేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.