ఒకే ఫ్యామిలీలో నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని దుర్గాపుర్ లో జరిగింది. మృతుల్లో ఏడాదిన్నర చిన్నారి, మరో ఆరేళ్ల బాలుడు ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అక్కడ సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో టీచర్ ఎలిజబిలిటి టెస్ట్ స్కామ్ లో ఉన్నవారే తమ మృతికి కారణమని రాసి ఉంది. ఈ దారుణ ఘటన దుర్గపుర్ లో జరిగింది.
మృతులు అమిత్ కుమార్ మొండల్(35), రూపా మొండల్(31).. దంపతుల పిల్లలు నిమిత్ కుమార్ మొండల్(6), నిఖితా మొండల్( ఏడాదిన్నర వయసు)గా పోలీసులు గుర్తించారు. అమిత్ మృతదేహం సీలింగ్ ఫ్యాన్ కు వేలాడుతూ ఉంది. రూపా, ఆమె ఇద్దరి పిల్లల మృతదేహాలు కింద పడి ఉన్నాయి. మృతుల మొబైల్లో ఓ సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది. టీఈటీ కుంభకోణంలో పాల్గొన్నవారే తమ మృతికి కారణమన్నట్లు అందులో ఓ మెసేజ్ ఉంది. స్థానికులు మాత్రం అత్మహత్య కాదు.. కచ్చితంగా హత్యేనని ఆరోపిస్తున్నారు. వారి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయని, ఆ విషయంలోనే వీరిని హత్య చేసి ఉంటారని చెబుతున్నారు.
అమిత్ కుటుంబం మృతికి అతని తల్లే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే అమిత్ తల్లి, కుంటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తి వివాదం కారణంగానే అమిత్ కుటుంబాన్ని హత్య చేశారు. అమిత్ మెడపై గాయాలు ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదు.. కచ్చితంగా హత్యే.. అందరి చేతులు కట్టేసి ఉన్నాయి సీసీ కెమెరా పాలిథీన్ కవర్ తో మూసేసి ఉంది. అమిత్ తల్లి, మిగతా కుటుంబసభ్యులే వారిని హత్య చేశారు. అమిత్ భార్య రూప కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అమిత్ తండ్రి.. నరేశ్ మొండల్ చాలా ఏళ్ల క్రితం మృతి చెందారు. అతను చాలా ఆస్తులు సంపాదించాడు. ఆ ఆస్తుల కోసమే వీరి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారని డీసీపీ గౌతమ్ కుమార్ వెల్లడించారు. అమిత్ కుటంబ సభ్యుల మృతికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియలేదని ఆయన వెల్లడించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు.