స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) మరో భారీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 5,369 ఉద్యోగ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్ వంటి పోస్టులు భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://ssc.nic.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 27 అప్లికేషన్ పంపడానికి చివరి తేదీ.