ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్‌పాల్ సింగ్ కోసం కొద్ది రోజులుగా పోలీసులు గాలిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతని మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం వద్ద ఖలిస్థాన్ మద్దతుదారులు వారి జెండాలతో నిరసన చేపట్టారు. భారత జెండాను అగౌరవపరిచి కిందికి దించివేస్తున్న వీడియోలు నెట్టింట దర్శనమిచ్చాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన భారత్, బ్రిటన్ దౌత్యవేత్తకు నోటీసులిచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa