బెంగళూరులో దారుణం జరిగింది. కోల్‌కతాకు చెందిన షేక్ సుహేల్, తబ్సీన్ బేబి (32) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. ఉపాధి కోసం వీరు గతంలో బెంగళూరుకు వచ్చారు. ఇక్కడ ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో తబ్సీన్ ఎఫైర్ పెట్టుకుంది. భర్తను, పిల్లలను వదిలి ప్రియుడితో వేరు కాపురం పెట్టింది. ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఇది తట్టుకోలేని సుహేల్ సోమవారం తబ్సీన్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.