ఓటర్ ఐడీతో ఆధార్‌ను అనుసంధానం చేసే గడువును కేంద్రం పొడిగించింది. గతంలో ఏప్రిల్ 1, 2023 లోపు లింక్ చేసుకోవాలని డెడ్‌లైన్ విధించిన ప్రభుత్వం, ఆ గడువును మార్చి 31, 2024 వరకు పెంచింది. 2022, ఆగస్టు నుంచి ఎన్నికల కమిషన్ రిజిస్టర్డ్ ఓటర్ల నుంచి ఆధార్ కార్డు నంబర్లను సేకరిస్తోంది. అయితే, వాటిని అనుసంధా నించే ప్రాసెస్ ఇంకా మొదలు కాలేదు. కాగా, జనవరి 1, 2023 నాటికి దేశంలో 95 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు.