క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. క్యారెట్‌లో విటమిన్ ఎ,బి, సి, ఇ లతోపాటు పొటాషియం,మెగ్నీషియం, సోడియం, మంగనీస్, ఐరన్, అయోడిన్, కాల్షియం ఉన్నాయి. క్యారెట్ గుండెకు, కళ్లకు మంచిది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ క్యారెట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా కుదుళ్లు గట్టి పడుతాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే నిద్రలేమిని తగ్గిస్తుంది. పురుషుల్లో వీర్య వృద్ధిరేటును కూడా పెంచుతుంది.