ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసం వచ్చేసింది. గురువారం రాత్రి నెలవంక దర్శన మివ్వడంతో శుక్రవారం నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇక నమాజ్, జకాత్, ఫిత్ర వంటి వాటిని ముస్లింలు చేపడతారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను 3 అష్రాలుగా విభజించారు. తొలి 10 రోజుల ఉపవాస కాలాన్ని రహ్మత్ అని, రెండోసారి వచ్చే 10 రోజుల కాలాన్ని బర్కత్, చివరి 10 రోజులను మగ్ఫిరత్ అని అంటారు.