పార్టీ నేతల తీరుపై టీడీపీ నేతలపై అధినేత చంద్రబాబు సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో రోజుకో అవినీతి బయటపడుతోందని.. నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గాల్లో నేతలు అవినీతిపై పోరాటం చేయకుండా మౌనంగా ఉండటం సరికాదని.. ప్రజల్లోకి ఎలా వెళతామన్నారు. ప్రజలకు సమస్యలు చాలా ఉన్నాయని.. వెంటనే ఫోకస్ పెట్టాలని సూచించారు. టీడీపీ జోన్ 3 సమీక్ష చేశారు.. నేతలకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ దిశా నిర్దేశం చేశారు. కొందరు నేతల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంతో పాటూ అవినీతిపైనా ఫోకస్ పెట్టాలని సూచించారు.
ఇంఛార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికార పార్టీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అక్రమంగా మట్టి, ఇసుక తవ్వకాలు చేస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గాల్లో సమస్యలపై పోరాటం చేయాల్సిందేనని.. ప్రజల్లో తిరిగాల్సిందే అన్నారు. నేతలు ఇకపైన పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు ఓటర్ల జాబితాలో అవకతవకలు గుర్తించాలని సూచించారు చంద్రబాబు. మైలవరం నియోజకవర్గంలో ఈ పరిశీలనలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. నియోజవర్గాల్లో దొంగ ఓట్లను నిరోధించాలని.. గత ఎన్నికల్లో ఓటర్ల జాబితాను సరి చూసుకోకపోవడం వల్లే ఇబ్బందిపడ్డామన్నారు. ఆధార్ అనుసంధానం ద్వారా అక్రమాలను అరికట్టాలని సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాపై ఫోకస్ పెట్టాలన్నారు. ఒక్కసారి గెలవాలని కార్యకర్తల మనసులో పడితే.. టీడీపీ గెలవాల్సిందే అన్నారు.
40ఏళ్లుగా భుజాలు అరిగిపోయేలా తెలుగుదేశం సైన్యం పా ర్టీజెండాలు మోస్తోందన్నారు.. కుటుంబాలు, ఆస్తులు కోల్పోయినా పార్టీ కోసమే పనిచేశారన్నారు. అలాంటి వారికి శిరస్సు వంచి అభివాదం చేస్తున్నాను అన్నారు. ఏడాది క్రితం బాదుడే బాదుడు కార్యక్రమం.. ప్రకాశంజిల్లాలో జరిగిన మహానాడుని కార్యకర్తలు, నేతలు భారీగా విజయవంతం చేశారన్నారు. తరువాత ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంతో.. పన్నులు, ఛార్జీలు, ధరల భారంతో దోచుకుంటున్నారని ప్రజల్లోకి కార్యకర్తలతో కలిసి వెళ్లామన్నారు. వీటి ఫలితమే 108 నియోజకవర్గాల్లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మూడు ఎమ్మెల్సీస్థానాలు గెలిచిందన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు కూడా జగన్ పై విశ్వాసం లేదన్నారు. 2019లో 23మంది టీడీపీ తరుపున గెలిస్తే అవహేళన చేశారని.. దేవుడి స్క్రిప్ట్ అని అందుకే 23మందే మిగిలారని ఎద్దేవా చేశారన్నారు. కానీ భగవంతుడు తిరిగి గొప్ప స్క్రిప్ట్ రాశాడని.. 23ఓట్లు, 23వతేదీ, 2023న భగవంతుడు స్క్రిప్ట్ తిరగ రాశాడననారు. ఇకపై అన్ స్టాపబుల్.. గేరుమార్చి స్పీడు పెంచుతున్నామన్నారు. సైకిల్ దూసుకెళ్తుంది.. అడ్డమొచ్చిన వారిని తొక్కుకుంటూ ముందుకు వెళ్తుందన్నారు.
పేదలజీవితాల్లో మార్పులు వచ్చేలా తెలుగుదేశం సంక్షేమాన్ని అమలు చేసిందన్నారు చంద్రబాబు. ప్రజల్లో ఇప్పటికే జగన్ పై వ్యతిరేకత వచ్చిందన్నారు. అధికార పార్టీపై పోరాడాలంటే మనంచాలా అప్రమత్తంగా ఉండాలని.. జగన్‌ది ధనబలం.. తెలుగుదేశానిది జనబలం అన్నారు. టీడీపీ గెలుపు కోసం పటిష్టమైన వ్యవస్థ తో ముందుకెళ్తున్నామని.. 25వేలఓట్లకు ఒక క్లస్టర్, 5వేలఓట్లకు ఒక యూనిట్, బూత్‌కు ఒక బూత్ కమిటీ.. 30 కుటుంబాలకు ఒక కుటుంబ సాధికార సారథి ఉన్నారన్నారు. సారథుల్లో పురుషులు.. మహిళలు ఉండాలన్నారు.. వీరు అన్ని కుటుంబాలను ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు. ఎవరైతే పార్టీ కోసం పనిచేశారో, వారిని వెతుక్కుంటూ పార్టీనే వారివద్దకు వెళ్తుందన్నారు.
మే నెల నుంచి నెలనెలా క్లస్టర్ ఇంఛార్జ్‌ల రిపోర్టులు వారికే పంపిస్తామన్నారు. యూనిట్ ఇంఛార్జ్‌లకు పంపిస్తామననారు.. తద్వారా పనితీరు మెరుగవుతుందన్నారు. డాష్ బోర్డ్ లో అందరి పేర్లు ఉంటాయని.. ఎవరు బాగా పనిచేశారో ఎప్పటికప్పుడు తెలుస్తుందన్నారు. కొంతమంది ఎప్పటినుంచో తనకు కనిపిస్తున్నారని.. వారు కనిపించినప్పడు బాగా చేస్తారని అనుకుంటాం.. కానీ క్షేత్రస్థాయిలో వారి పనితీరు మాత్రం అధ్వాన్నంగా ఉంటుందన్నారు. ఇకపై పనిచేసేవారినే గౌర విస్తామని.. మొదటి ప్రాధాన్యత వారికే ఉంటుందన్నారు.
ఈ ప్రభుత్వంలో రాష్ట్రానికి వచ్చిన సమస్యలు, ప్రజలుపడుతున్నఇబ్బందులపై మాట్లాడాలన్నారు. 10మందిని ప్రభావితంచేసే విధానంతో ముందుకుపోతే.. మండలంలో ఉండే సమస్య ల్ని వీడియోల రూపంలో పార్టీకి తెలియజేయాలన్నారు. గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, విజయవాడ, మచిలీ పట్నం పార్లమెంట్లలోని అన్ని నియోజకవర్గాలలో ఉన్నసమస్యలు, ప్రజలకష్టాలపై మాట్లాడాలన్నారు. పల్నాడుజిల్లాలో ఫ్యాక్షనిజం ఎక్కువైంది. వరికపూడిసెల, బొల్లాపల్లి రిజర్వాయర్లు పూర్తి చేయాల్సి ఉంది. రైతుభరోసాకేంద్రాల పేరుతో రైతుల్ని దోచుకుంటున్నారు. ప్రజలతో మమేకంకండి.. వారితో వినయంగా ఉండండి. వారికష్టాలు, ఇబ్బందులకు సంఘీభావం తెలపాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa