ఎమ్మిగనూరు మండలం దైవందిన్నె గ్రామంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి జాతరను పురస్కరించుకుని వైఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో 31 నుంచి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు శనివారం ఆర్గనైజర్లు ఈరన్న, బీసుపల్లి, రవి, లక్ష్మీనారాయణ, ఖాజ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోటీలో పాల్గొనే జట్లు రూ. 500 ఎంట్రీ ఫీజు చెల్లించి నెల 30 లోపు తమ జట్టు పేరు నమోదు చేయించుకోవాలని తెలిపారు.