డి. హీరేహాల్ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బొమ్మనహాల్ మండలం గోవిందవాడ గ్రామానికి చెందిన ఇద్దరు మిరప రైతులు దుర్మరణం పాలయ్యారు. గోవిందవాడకు చెందిన మిర్చి రైతులు కేశన్న, వన్నూరప్పలు మిర్చి పంటను బొలెరోలో మార్కెట్ కు తీసుకెళుతుండగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa