వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని, చిలకం మధుసూదన రెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే కావాలని ధర్మవరం జనసేన పార్టీ నాయకులు కేలవత్ నాయుడు ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణ (చిన్న), కడపల సుధాకర్ రెడ్డి, ధారా గంగాధర్, గొంగటి హరి, వెంకటేష్ నాయక్, నారాయణస్వామి నాయక్, మాలేపాటి శ్రీరామ్ వీరందరూ పట్టణంలోని పలు ఆలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ధర్మవరం నుంచి తిరుమలకు కాలినడకతో యాత్ర కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. మీడియా ముఖంగా నాయుడు నాయక్ మిత్ర బృందం మాట్లాడుతూ ధర్మవరంలో చేనేత వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా అదే విధంగా ధర్మవరంలో పేదరికం పోవాలన్న ముస్లిం మైనారిటీలు బడుగు బలహీన వర్గాల వారు బాగుపడాలన్న రైతుల కష్టాలు తెలిసిన వ్యక్తి రైతుల కష్టాలు పోవాలన్నా స్థానికుడైన మధుసూదన్ రెడ్డి ధర్మవరం ఎమ్మెల్యే కావాలని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుమల కు పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు.
![]() |
![]() |